తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Agent trailer : వైల్డ్​గా అఖిల్​ 'ఏజెంట్' ట్రైలర్​.. - Agent trailer

అఖిల్‌ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఏజెంట్‌'. విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీటీమ్​ ట్రైలర్​ను రిలీజ్​ చేసింది. మీరు చూశారా?

Akhil Akkineni Agent movie trailer released
అఖిల్ అక్కినేని ఏజెంట్ ట్రైలర్ రిలీజ్​

By

Published : Apr 18, 2023, 8:53 PM IST

Updated : Apr 18, 2023, 9:15 PM IST

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు 'ఏజెంట్'గా ఆడియెన్స్​ ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రమే 'ఏజెంట్‌'. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్​, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేయగా.. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ మూవీకి కథను అందించారు. గతంలో ఈ డైరెక్టర్ అండ్ రైటర్ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్​ హిట్​గా నిలిచాయి. దీంతో ఏజెంట్​ సినిమాపై అటు అక్కినేని అభిమానుల్లో ఇటు ఆడియన్స్​లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్​ 28న పాన్​ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. గ్రాండ్​గా ట్రైలర్​ లాంఛ్ ఈవెంట్​ను నిర్వహించి ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ ట్రైలర్​లో యాక్షన్​ సీన్స్​ గూస్​ బంప్స్​ తెప్పించేలా ఉన్నాయి. బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా బాగానే ఉంది. లవర్ బాయ్​ అఖిల్​ మాత్రం ఫుల్​ వైలంట్​గా కనిపించారు. తనలోని పూర్తి యాక్షన్​ లుక్​ను బయటకు తీశారు. మొత్తంగా అఖిల్‌ అల్ట్రా స్టైలిష్​ లుక్స్​, ఆయన చెప్పిన డైలాగ్స్​.. అక్కినేని అభిమానుల్లో ఫుల్​ జోష్‌ నింపేలా ఉన్నాయి. 'నువ్వు ఏజెంట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావ్​.. అని అఖిల్‌ను అడుగుతున్న సంభాషణలతో ప్రారంభమైంది ఈ ట్రైలర్‌. 'సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే' అని మమ్ముట్టి చెప్పడం.. చేతిలో కత్తి, గన్​ పట్టుకుని విలన్స్​పై విరుచుకుపడుతూ.. యాక్షన్‌, ఎమోషన్స్​తో ప్రతి నిమిషం గూస్ బంప్సే కదా జీ అంటూ అఖిల్ డైలాగ్​ చెప్పడం.. ఇలా స్టన్నింగ్, యాక్షన్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో ప్రచార చిత్రం సాగింది.

ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్​గా నటించింది. తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్​ మూవీ. మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాతో సురేందర్​ రెడ్డి నిర్మాతగా మారారు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి సంబంధించిన స‌రెందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించారు. ఇక లవర్​ బాయ్​గా ఉన్న అఖిల్​.. కొత్త హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో పూర్తిగా వైల్డ్ లుక్‌లోకి ట్రాన్స్​ఫార్మేషన్​ అయిపోయి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాడు.

ఇదీ చూడండి:'వినోదయం సీతం'.. ఆ ప్రయోగం చేస్తారా?

Last Updated : Apr 18, 2023, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details