అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అఖిల్ పట్టుదలతో ఉన్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో మంచి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి.. వక్కంతం వంశీ అందించిన కథతో.. ఏజెంట్ సినిమాను రూపొందించారు. ఇందులో అఖిల్ స్పై ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్పై నిర్మాత అనిల్ సుంకర.. దర్శకుడు సురేందర్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంతోనే సురేందర్ నిర్మాతగా మారారు. రూ.40కోట్ల అంచనాలతో ఈ సినిమాను ప్రారంభించగా.. దాదాపు రూ.80కోట్ల వరకు ఖర్చు అయిందని ప్రచారం సాగింది. అయితే ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఈ నెల 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మొదట్లో పాన్ ఇండియా స్థాయిలో దీన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మలయాళం, తెలుగు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ట్రెడ్ వర్గాల సమాచారం ప్రకారం..
అఖిల్ చివరి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18.50 కోట్లు జరగగా.. ఇప్పుడు 'ఏజెంట్' దానికి డబుల్ ఫిగర్స్‌ను అందుకుంది. నైజాం ఏరియాలో రూ.10కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.4.50కోట్లు, ఆంధ్ర ఏరియా మొత్తం రూ.14.80కోట్లు, ఆంధ్ర-తెలంగాణ కలిపి రూ.29.30కోట్లు, కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.3.80కోట్లకు, ఓవర్సీస్ ద్వారా రూ.3.10కోట్లు. మొత్తంగా వరల్డ్ వైడ్ రూ.36.20కోట్లు బిజినెస్ చేసినట్లు తెలిసింది. అంటే సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ.37కోట్లు అన్న మాట. అఖిల్ కెరీర్ ఇది సెకండ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఆయన నటించిన మొదటి సినిమా అఖిల్.. అప్పట్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.42కోట్లు జరగగా.. 'ఏజెంట్' దానికి దగ్గరగా వచ్చింది.