ఇటీవలే రీసెంట్గా 'తునివు'(తెలుగులో తెగింపు) ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరో అజిత్ కుమార్.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం 'రాజా రాణీ' ఫేమ్ డైరక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'ఏకే 67' (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఇంట్రెస్టింగ్ అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేందంటే పొన్నియన్ సెల్వన్‌తో సౌత్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో అజిత్ సరసన కనిపించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే కనుక ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి.
ఒకే స్క్రీన్‌పై అజిత్-ఐశ్వర్య.. 22ఏళ్ల తర్వాత! - ajith and aishwarya in ak67
స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇటీవలే తెగింపుతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో పడిపోయారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్తో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయ్యింది. అదేంటంటే ఇందులో అందాల తార ఐశ్వర్యాయ్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ సంగతులు..
గతంలో 22 ఏళ్ల క్రితం వీరిద్దరు 'ప్రియురాలు పిలిచింది' అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే సినిమలో వీరిద్దరు కనిపించలేదు. దీంతో మళ్లీ వీళ్లు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే బాగుండు అని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యాతో పాటు అరవింద స్వామి, అర్జున్ దాస్ లాంటీ కీలక వ్యక్తులు నటించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా సినిమాకు గట్టి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చేందుకు యంగ్ డైరక్టర్ అనిరుధ్ పనిచేయనున్నట్లు టాక్.