తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విక్రమ్​ కోబ్రా.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు - క్షమాపణలు చెప్పిన కోబ్రా దర్శకుడు

'కోబ్రా'పై వస్తున్న విమర్శలకు స్పందించారు చిత్ర దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు. అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

cobra director
క్షమాపణలు చెప్పిన కోబ్రా దర్శకుడు

By

Published : Sep 5, 2022, 2:36 PM IST

చియాన్‌ విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'కోబ్రా'పై విమర్శలు వస్తున్నాయి. క్లైమాక్స్‌ బాలేదని, నిడివి ఎక్కువగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ విమర్శలపై తాజాగా చిత్ర దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు స్పందిస్తూ వారికి క్షమాపణలు చెప్పారు. ''కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్‌ నిరాశాజనకంగా ఉంది'' అని ఓ నెటిజన్‌ అనగా.. ''పోలీసుల నుంచి హీరో తప్పించుకొని విదేశాల్లో స్వేచ్ఛగా బతుకుతున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా?'' అని అజయ్‌ సమాధానమిచ్చారు.

''స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉంది'' అని మరో నెటిజన్‌ విమర్శించగా.. ''మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు సారీ. ప్రతీ క్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమాలు చూడటం ఒక ప్రేక్షకుడిగా నేనిష్టపడతాను. అదేవిధంగా 'కోబ్రా'ని తెరకెక్కించా. సాధ్యమైతే మరోసారి మా చిత్రాన్ని వీక్షించండి. తప్పకుండా మీకు నచ్చుతుంది'' అంటూ దర్శకుడు చెప్పారు. ''కోబ్రా' అంత నిడివితో ఎందుకు విడుదల చేశారు?'' అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా.. ''సినిమాలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాలనుకున్నాం. అందుకే మొదటిరోజు మూడు గంటల నిడివితో చిత్రాన్ని విడుదల చేశాం. పలువురు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వల్ల నిడివి తగ్గించాం. నిడివిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అర్థమైంది. తదుపరి చిత్రాల నుంచి ఈ తప్పు జరగకుండా చూసుకుంటా'' అని ఆయన వివరించారు.

ఇదీ చూడండి: సల్మాన్​ ఖాన్​ సినిమాకు కొత్త టైటిల్​ ఫిక్స్​.. లుక్​ అదిరిందిగా

ABOUT THE AUTHOR

...view details