స్టార్ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు 'పొన్నియిన్ సెల్వన్'. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు చిత్రబృందం మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇక ఈ సినిమాలో 'నందిని' పాత్రలో నటించిన అందాల తార ఐశ్వర్య రాయ్.. ముంబయిలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో మణిరత్నంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మణిరత్నం నాకు గురువు. నా మొదటి సినిమా ఆయన దర్శకత్వంలోనే నటించాను. ఒక నటిగా నా ప్రయాణం ఆయన దర్శకత్వంతో మొదలైనందుకు నేను అదృష్టవంతురాలిని. ఆయన ఉత్తమ గురువు".
"అప్పట్లో ఇరువర్, గురు, రావణ్, ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్.. ఇలా మంచి సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. ఇక 'పొన్నియిన్ సెల్వన్'లో భాగమవ్వడం ఏ కళాకారుడికైనా కలే. అలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు మనమంతా అదృష్టవంతులం. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పని చేశారు" అని మణిరత్నంపై తనకున్న గౌరవాన్ని తెలిపారు.