అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్- కండల వీరుడు సల్మాన్ ఖాన్.. బాలీవుడ్లో ఒక్కప్పుడు క్రేజీ అండ్ పాపులర్ పెయిర్. వీరిద్దరూ ప్రేమలో కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఆశించినట్లు.. కానీ ఆ తర్వాత విడిపోయినట్లు అంతా మాట్లాడుకుంటుంటారు. అయితే ఐశ్వర్య.. అభిషేక్ బచ్చ్ను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోగా.. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా ప్రొఫెషనల్ లైప్‌లో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు వీరిద్దరూ ఏమైన ఫంక్షన్లో ఎదురుపడినా పెద్దగా మాట్లాడుకోకుండానే, చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు! రీసెంట్గా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నిర్వహించిన కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్లోనూ వీరిద్దరూ మెరిశారు. ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అయినా మాట్లాడుకున్నట్లు పెద్దగా కనిపించలేదు.
అయితే తాజాగా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. ఆ వీడియోలో ఈ సుందరి.. సల్మాన్ గురించి మాట్లాడింది. సల్మాన్ భాయ్.. బాలీవుడ్లో సెక్సియెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ మ్యాన్‌గా అభివర్ణించింది. బీటౌన్‌లో సెక్సీగా, బ్యూటీఫుల్‌గా కనిపించే వ్యక్తి ఎవరు? అని ఓ ప్రశ్న ఎదురుకాగా.. ఐశ్వర్య కాసేపు సైలెంట్‌గా ఉండి.. తర్వాత సల్మాన్ పేరును చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పాత వీడియోను నెట్టింట్లో వైరల్ అవుతుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వీడియోను ఏ సైట్ వారు దాన్ని ఎంబెడ్ చేయలేదు. కాగా, సల్మాన్ ఖాన్-ఐశ్వర్యా రాయ్ తొలిసారిగా 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాతో వీరిద్దరి పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని చెప్పుకుంటుంటారు.