తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Agent Movie OTT Release : అఖిల్ 'ఏజెంట్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? - ఏజెంట్ సినిమా థియేటర్ రిలీజ్ డేట్

Agent Movie OTT Release : అక్కినేని ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్. అఖిల్ స్పై గా నటించిన 'ఏజెంట్' సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో విడుదల కానుందంటే?

Agent Movie OTT Release
Agent Movie OTT Release

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 7:48 PM IST

Updated : Sep 22, 2023, 8:11 PM IST

Agent Movie OTT Release :టాలీవుడ్ ​యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్​ రోల్​లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య.. అఖిల్​కు జోడీగా నటించింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 28న థియేటర్‌లో విడుదలైంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్​కు నోచుకోలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ క్లారిటీ వచ్చింది.

ఎట్టకేలకు ఏజెంట్ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ 'సోనీలివ్'లో సెప్టెంబర్​ 29 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు సదరు సంస్థ.. సోషల్ మీడియాలో ట్రైలర్‌ను షేర్‌ చేసింది. అయితే ముందుగా ఈ సినిమా మే 19 నుంచే ఓటీటీలో అందుబాటులో ఉండనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి, రన్​టైమ్​ కారణంగా తీసేసిన మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఆలస్యంగా విడుదల చేయాలని సదరు సంస్థ భావించినట్లు అప్పట్లో టాక్​ వినిపించింది. అయితే ఇప్పుడు ఓటీటీలో ఏ వెర్షన్ రిలీజ్ అవుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.

సడెన్​గా ఓటీటీలోకి బెదురులంక 2012.. యంగ్ హీరో కార్తికేయ-నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. గతనెల 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండా సడెన్​గా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Nene Naa OTT Release Date :టాలీవుడ్ యంగ్ బ్యూటిఫుల్ నటి రెజీనా కసాంద్ర.. ఎప్పటికప్పుడు భిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె రీసెంట్​గా 'నేనే నా' సినిమాతో ఆడియోన్స్​ను పలకరించింది. ఈ సినిమాలో రెజీనా ఆర్కియాలజిస్ట్‌గా కనిపించింది. దర్శకుడు కార్తీక్‌ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 25న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'ఆహా'లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

Jailer Movie Chiranjeevi : 'జైలర్​'లో హీరోగా అనుకున్నది రజనీని కాదా? చిరునా?.. అయ్యో మంచి హిట్​ మిస్సయ్యారే!

September 2023 OTT Release : ఓటీటీలోకి వరుణ్ 'గాండీవధారి', దుల్కర్ 'కింగ్ ఆఫ్ కొత్త'.. ఇంకా ఏయే సినిమాలంటే?

Last Updated : Sep 22, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details