తాను క్షేమంగా ఉన్నానని, వీలైనంత త్వరగా అందరితో మాట్లాడతానని నటుడు విజయ్ ఆంటోని తెలిపారు. తన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మలేషియాలో ఇటీవల జరిగిన 'పిచ్చైకారన్' 2' (తెలుగులో బిచ్చగాడు 2) సినిమా చిత్రీకరణలో ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటన అనంతరం తొలిసారిగా విజయ్ స్పందించారు. "దవడ, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాల నుంచి బయటపడ్డా. సంబంధిత సర్జరీ పూర్తయింది. త్వరలోనే మీ అందరితో మాట్లాడతా" అని ఆయన తెలిపారు.
'తీవ్ర గాయాల నుంచి బయటపడ్డా.. త్వరలోనే మీతో మాట్లాడతా'.. విజయ్ ఆంటోని ట్వీట్ - tamil hero vijay antony latest news
మలేషియాలో 'పిచ్చైకారన్' 2' సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదానికి గురయ్యారు నటుడు విజయ్ ఆంటోని. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మొదటిసారిగా ట్వీట్ చేశారు.

విజయ్ ఆంటోని
స్వీయ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తోన్న చిత్రమే 'బిచ్చగాడు 2' (Pichaikkaran 2). గతంలో ఈయన హీరోగా వచ్చిన సూపర్‌హిట్ సినిమా 'బిచ్చగాడు'కు సీక్వెల్‌గా రూపొందుతోంది. 'బిచ్చగాడు'తోపాటు 'డాక్టర్ సలీమ్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఈ తమిళ నటుడు. 'మహాత్మ, 'దరువు' చిత్రాలతో సంగీత దర్శకుడిగానూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.