మరో ప్రముఖ సినీ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్.. తన భార్య సీమా ఖాన్ విడిపోపోవాలని నిర్ణయించాకున్నారు. తమ 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ.. ముంబయి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సోహైల్ ఖాన్- సీమా ఖాన్‌ది ప్రేమ వివాహం. 1998లో పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్త వచ్చాయి. అయితే ఆ వార్తలను సీమా ఖండించింది. ఆ తర్వాత కొంత కాలం వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అయితే కొంత కాలంగా మాత్రం ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. శుక్రవారం ఫ్యామిలీ కోర్టులో సోహైల్, సీమా విడివిడిగా ముంబయి ఫ్యామిలీ కోర్టులో దర్శనం ఇవ్వడం వల్ల విడాకుల కోసమేనని క్లారిటీ వచ్చింది. అయితే విడాకుల విషయంపై ఈ జంట ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.