26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించగా శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. తెలుగు ప్రచార చిత్రాన్ని మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటలను ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపించింది. లుక్స్, నటనపరంగా శేష్ మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
'ధగడ్ సాంబ' ట్రైలర్..