తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్​ ఎందుకున్నాడబ్బా.. లింక్​ ఏంది? - అఖిల్​తో అడవి శేష్​

టాలీవుడ్​ సెలబ్రిటీలంతా తమ కుటుంబాలతో కలిసి క్రిస్మస్​ వేడుకలను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే హీరో అడివి శేష్​ మాత్రం.. అక్కినేని ఫ్యామిలీతో కలిసి చేసుకున్నాడు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు మెదులుతున్నాయి.

Advi Sesh with akkineni family
అక్కినేని ఫ్యామిలితో అడవి శేష్​

By

Published : Dec 26, 2022, 1:29 PM IST

క్రిస్మస్ పండగను సెలబ్రిటీలు గ్రాండ్​గా చేసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ కూడా అంతా ఒక చోట చేరి​ క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేసుకుంది. ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కజిన్స్ అందరు పాల్గొన్నారు. ఈ వేడుకలో హీరో అఖిల్, సుమంత్​లతో పాటుగా మరికొంత మంది ఉన్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తూ.. "అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రేమ, సంతోషంతో అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు హీరో అఖిల్.

అయితే ఇక ఈ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు హీరో అడవి శేష్. అక్కినేని కజిన్స్​తో పాటు అడివి శేష్ కూడా ఉండటంతో అభిమానుల్లో పలు ఆసక్తికరమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని కజిన్స్ పార్టీలో అడవి శేష్ ఎందుకు ఉన్నాడు? త్వరలోనే ఏదైనా న్యూస్ వినబోతున్నామా? అంటూ ఈ పిక్ చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే అడవి శేష్ కూడా మీ పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ రాసుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఏజెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ABOUT THE AUTHOR

...view details