గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్‌పై నెటిజన్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో క్యూటీ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అమాయకపు చూపులతో ఆకట్టుకుంటున్న ఈ లిటిల్ ప్రిన్సెస్.. ఇప్పుడు హీరోయిన్. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేడు(అక్టోబర్ 28) ఆమె పుట్టినరోజు కూడా. గుర్తుపట్టగలరా?
ఈ అమాయకపు చూపుల చిన్నారి.. ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. తెలుసా? - అదితిరావు హ్యాపీ బర్త్‌డే
పై ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. అందం అభినయం ముఖ్యంగా తన అమాయకపు కళ్లతో కుర్రాళ్లను ఫిధా చేసింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?
ఇంతకీ ఆమె మరెవరో కాదు.. క్రేజీ హీరోయిన్ అదితి రావు హైదరీ. చెలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత వీ, అంతరిక్షం, మహా సముద్రమం చిత్రాల్లో నటించింది. కాగా, ఈ అమ్మడు హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా దానిపై క్లారిటీ వచ్చేసింది. హీరో సిద్ధార్థ్ ఆమెకు విషెస్ చెబుతూ హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో వారిద్దరి రిలేషన్ కన్ఫామ్ అయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి:ఆలీ షోకు గెస్ట్‌గా పవన్ కల్యాణ్.. నిజమేనా?