తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Adipurush Trailer : ప్రభాస్‌ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. 'ఆదిపురుష్‌' ట్రైలర్‌ డేట్​ ఫిక్స్​! - ఆదిపురుష్​ కొత్త పోస్టర్​

రెబల్​ స్టార్​ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆదిపురుష్'​. ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. త్వరలో ట్రైలర్​ రిలీజ్​ చేసేందుకు చిత్ర యూనిట్​ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఎక్కడనే నిర్వహిస్తారనే విషయం కూడా ఫైనల్​ అయినట్లు సమాచారం. ఆ వివరాలు..

adipurush trailer release date 2023
adipurush trailer release date 2023

By

Published : May 2, 2023, 10:12 PM IST

Updated : May 2, 2023, 10:28 PM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం తెరకెక్కించిన సినిమా 'ఆదిపురుష్'. కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అయితే, గతేడాది విడుదల చేసిన టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చిత్ర బృందం.. ఇప్పుడు వాటిని సరిదిద్దే పనిలో పడింది. మరింత నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు విజువల్స్ ఎఫెక్ట్స్​ మెరుగుపరిచే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో అందరినీ అలరించేలా 'ఆదిపురుష్' ట్రైలర్ ఉండేలా సన్నాహాలు చేస్తోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం మే 9న.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. అంతే కాకుండా ఈ ట్రైలర్​ నిడివి 3 నిమిషాల 22 సెకండ్లుగా ఉండనున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్​ను తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ట్రైలర్‌ను ప్రదర్శించే థియేటర్ల జాబితాను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో పంచుకుంటున్నారు. 'ఆదిపురుష్' ట్రైలర్‌ను 3డిలో చూపించనున్నారు. మరోవైపు జూన్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్లతో పాటు ఓ మోషన్‌ పోస్టర్​ను విడుదల చేసింది. సీతానవమి సందర్భంగా ఈ పోస్టర్​ను రిలీజ్​ చేసిన మూవీ టీమ్..​ "అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం" అనే క్యాప్షన్​తో షేర్​ చేసింది. ఓ పోస్టర్​లో లంకలో ఉన్న సీతమ్మ.. రాముడి రాక కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నట్లు కనిపించారు. మరో పోస్టర్​లో సీతమ్మ తల్లి వెనుక రామునిగా ప్రభాస్​ నిల్చుని ఉన్నారు. ఇక ఇదే పోస్టర్​లో లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు లంకకు పయనమైనట్లు కనిపించారు. అంతకుముందు రిలీజైన ఫస్ట్​ సింగిల్​తో పాటు ప్రభాస్​ మోషన్​ పోస్టర్​కు​ కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఆదిపురుష్‌

గతేడాది రిలీజైన టీజర్​కు అభిమానుల్లో మిశ్రమ స్పందన రావడం వల్ల మూవీ టీమ్​ గ్రాఫిక్స్​ను మెరుగుపరిచింది. ఈ క్రమంలో ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లు చాలా బాగున్నాయని అభిమానులు అంటున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓంరౌత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణుని పాత్రలో బాలీవుడ్​ హీరో సన్నీ సింగ్​ నటించారు. హనుమంతుని పాత్రలో దేవదత్త్ నాగే​ నటించారు. ఇక లంకేశుని పాత్రలో బాలీవుడ్​ స్టార్​ సైఫ్​ అలీ ఖాన్​ నటించారు.

Last Updated : May 2, 2023, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details