Adipurush Release Date : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఆదిపురుష్' ఓంరౌత్ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం మొదటి నుంచి భావించినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు.
ఇదిలా ఉండగా, 'ఆదిపురుష్' రిలీజ్‌పై తాజాగా పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతోన్నాయి. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ఆయా వార్తల్లోని సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఫోకస్ చేసిన చిత్రబృందం.. టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టిందని.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్‌ఎక్స్, సీజీ పనులు చేయిస్తోందని బీటౌన్ టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సమ్మర్‌లో కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని ఆయా కథనాల్లోని సారాంశం.