Prabhas Adipurush Movie : ప్రభాస్ 'ఆదిపురుష్' టీమ్ చేసిన ఓ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ మూవీటీమ్ చేసిన ప్రకటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదేంటంటే. ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ హనుమంతుడి కోసం కేటాయించుతున్నామని(ఖాళీగా ఉంచడం).. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకు హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ఇలా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలాంటి చేయడం కొత్తేమి కాదంటూ సోషల్‌మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో పలు సినిమాలకు ఇలా.. గతంలో పలు తెలుగు చిత్రాలకు ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్స్ చేశారని గుర్తుచేసుకుంటున్నారు. 1943లోనే భక్త పోతన సినిమా కోసం.. ఆ మూవీటీమ్.. బెంగళూరులో తమ సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు భారీ హనుమంతుడి కటౌట్ పెట్టించింది. అలా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది. దాన్ని చూసేందుకు వచ్చిన చాలా మంది సినిమాకు వెళ్లడం జరిగిందట.
అనంతరం 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం'(1960), 'అన్నమయ్య'(1997) థియేటర్లలోనూ వేంకటేశ్వరస్వామి విగ్రహాలు పెట్టించారట. 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం' థియేటర్ల హుండీ డబ్బులు రికార్డు స్థాయిలో కానుకలు వస్తే.. వాటిని టీటీడీకి ఇచ్చారట. అలానే 'అమ్మోరు' సినిమా ఆడుతున్న సమయంలో ప్రతి థియేటర్ ముందు మట్టితో అమ్మోరు బొమ్మ చేయించి పెట్టడం జరిగిందట. థియేటర్లలో హారతులు కూడా పట్టారట. 'దేవి' చిత్రం ప్రదర్శించిన థియేటర్లో పుట్ట సెటప్‌లు పెట్టారట. ఇప్పుడు 'ఆదిపురుష్' కూడా అదే కోవలో కాస్త భిన్నంగా ఆలోచించి హనుమంతుడి కోసం ఖాళీ సీట్ పెట్టిస్తోందని తెలుస్తోంది.