తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

50అడుగుల ప్రభాస్​ హోలోగ్రామ్​​.. అయోధ్య సెట్​.. ఆదిపురుష్​ ప్రీరిలీజ్​ ఈవెంట్ ప్లాన్​​ కేక​! - adipurush news

Adipurush Pre Release Event : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా నటించిన 'ఆదిపురుష్‌' ప్రీరిలీజ్‌ వేడుకను తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో చేస్తున్న ఈ ప్రీరిలీజ్‌ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు మీకోసం.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 5, 2023, 8:11 PM IST

Updated : Jun 5, 2023, 8:17 PM IST

Adipurush Pre Release Event : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ డ్రామా ఆది పురుష్‌. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దారు. రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌ కీలక పాత్రలు పోషించారు. లంకేశ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ జరగని రీతిలో చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ఇంత భారీ స్థాయిలో చేస్తున్న ఈ ప్రిరీలీజ్‌ వేడుకకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

  • ఆది పురుష్‌ ప్రీరిలీజ్‌ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
  • సినీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగుల ప్రభాస్‌ హాలోగ్రామ్‌ ప్రదర్శించనున్నారు.
  • అయోధ్యను తలపించేలా తిరుపతిలో భారీ సెట్‌ వేశారు. శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి రెండూ శ్రీమహావిష్ణువు అవతారాలే. దాన్ని దృష్టిలో ఉంచుకునే అటు అయోధ్య, ఇటు తిరుపతిల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని తలపించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారు.
  • 100 డ్యాన్సర్లు, 100మంది గాయనీ గాయకులు ఆదిపురుష్‌తో పాటు, రామాయణానికి సంబంధించిన గీతాలను ఆలపించనున్నారు.
  • డైరెక్టర్​ ప్రశాంతవర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.
  • ఈవెంట్​కు లక్షమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • తిరుపతి శ్రీ వేంకటశ్వర యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న ఈవెంట్‌ సీటింగ్‌ను పలు విధాలుగా విభజించారు. స్టేజ్‌కు ముందు వరసను అయోధ్యగా పేర్కొనగా, ఆ తర్వాత భాగాన్ని మిథిలగా, ఆ తర్వాత పంచవటి, దాని వెనుక గ్యాలరీకి కిష్కింద అని పేర్లు పెట్టారు.
    ఈవెంట్‌ సీటింగ్‌ ప్లాన్​
  • ఈ సినిమాకు బాలీవుడ్‌ సంగీత ద్వయం అతుల్‌-అజయ్‌లు స్వరాలు సమకూర్చారు. వీరిలో అతుల్‌ ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పైన వచ్చారు. శనివారం ముంబయిలో బయలుదేరిన ఆయన సోమవారం తిరుపతి చేరుకున్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని.. స్వామి వారి పాదాల వద్ద జైశ్రీరామ్‌ పాటను సమర్పించారు.

సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్​..సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఆదిపురుష్​ ప్రీరిలీజ్​ ఈవెంట్ అనే హ్యాష్​ట్యాగ్​ఫుల్​ ట్రెండ్​ అవుతోంది. ఈవెంట్​ జరగనున్న ప్రదేశానికి ఒకరోజు ముందుగానే అభిమానులు చేరుకుని.. అక్కడి ఫొటోలు, వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియా అంతా 'ఆదిపురుష్‌' పోస్టర్లు, ప్రీ రిలీజ్​ ఈవెంట్ల ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలతో నిండిపోయింది. ఇకపోతే ఈవెంట్​లో ప్రభాస్​ ఏం మాట్లాడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూవీ టీమ్​ కూడా కౌంట్​డౌన్​తో రోజుకో పోస్టర్​ రిలీజ్​ చేస్తూ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Last Updated : Jun 5, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details