పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఇది యానిమేటెడ్ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందే దర్శకుడు ఓం రౌత్ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆది పురుష్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్.. ఓం రౌత్‌కు రూ.4.02 కోట్ల విలువైన కారు గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అసలు నిజం అది కాదు. సరదాగా ఓం రౌత్, భూషన్ కుమార్ ఒక ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. దీంతో లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఊహాగానాలు వచ్చాయి.