Adipurush Day 11 Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా బాక్సాఫీస్ ముందు క్రమక్రమంగా ఢీలా పడిపోతూ వస్తోంది. సినిమా రిలీజైన తొలి వారంలో జోరుగా సాగిన కలెక్షన్స్.. ఇప్పుడు కాస్త నెమ్మదించాయి. సోషల్ మీడియాలోకాంట్రవర్సీలతో పాటు ప్రేక్షకులు ఇస్తున్న నెగిటివ్ టాక్ వల్ల ఈ సినిమా అటు స్టోరీ పరంగానూ ఇటు కలెక్షన్ల పరంగానూ ఎన్నో విమర్శలను అందుకుంటోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ మొత్తం కలిపి రూ.240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.
Adipurush Box Office Collections : 'ఆదిపురుష్' మూవీకి 11వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.5 లక్షలు, సీడెడ్‌లో రూ.12 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.4 లక్షలు, గుంటూరులో రూ.2 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 74 లక్షలు షేర్, రూ.1.15 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయిందని ట్రేడ్ వర్గాల అంచనా.