Adipurush Advance Booking : రామాయణ ఇతిహాసం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలకు సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు టికెట్ల విక్రయాల్లో రికార్డు బ్రేక్ చేస్తోంది. ఆన్లైన్లో ఇప్పటికే ఈ చిత్ర అడ్వాన్స్ టికెట్ల విక్రయాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలను అధిగమించాయట. హిందీలో షారుక్ పఠాన్ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసిందట ఆదిపురుష్.
Adipurush Tickets : ప్రస్తుతం దేశమంతా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్లు మొదలయ్యాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమై 24 గంటలు గడవకుముందే అనేక రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ల్లో హిందీ వెర్షన్లో ఈ చిత్రం రూ.1.40 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తొలిరోజుకు సంబంధించి 36వేల టికెట్లు అముడైనట్లు తెలిసింది. విడుదలకు ముందే రూ.1.62 కోట్లు వచ్చేశాయి!
Adipurush Hanuman : టికెట్ల విక్రయంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకాన్ని గౌరవిస్తూ.. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, రాముడి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10 వేలకుపైగా టికెట్లను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు అందివ్వనున్నట్టు ప్రకటించారు.
Adipurush Ranbeer Kapor : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ సైతం తనవంతుగా 10 వేల టికెట్లను, పేద చిన్నారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలోని రామాలయానికి 100+1 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు శ్రేయస్ మీడియా ప్రకటించింది. తాజాగా బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా 10వేల టికెట్స్‌ను బుక్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనాథపిల్లల కోసం వీటిని కొన్నట్లు తెలిపింది. మరోవైపు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామచరణ్ కూడా 10 వేల టికెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమచారం. ఇలా తెలుగు, హిందీలో అనేక మంది ప్రముఖులు ఆదిపురుష్ టికెట్లను విడుదలకు ముందే పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తుండటంతో ఆ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపవుతున్నాయి.
Adipurush Cast : అత్యంత భారీ బడ్జెత్‌తో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడు/లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించగా తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున విడుదల చేస్తోంది.