పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12నే విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కాగా, ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మరోసారి విడుదల చేయబోతున్నారు. ఇదివరకు రిలీజైన టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తడం వల్ల మేకర్స్ మళ్లీ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ టీజర్‌ను శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
'ఆదిపురుష్' రెండో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి ఏం జరుగుతుందో? - ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రెండో టీజర్ విడుదల కానుంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ఈ సారి రావణుడు ఎలా ఉంటాడో..?'
ఇదివరకు విడుదలైన 'ఆదిపురుష్' టీజర్‌పై తీవ్ర దుమారం రేగింది. అందులో రావణుడి పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పాత్రను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సినిమా మొత్తం యానిమేషన్లా ఉందని కామెంట్లు పెట్టారు. ఆంజనేయుడి రూపాన్ని కూడా వక్రీకరించినట్లు ఆరోపణలు చేశారు. సినిమాలో తోలు వస్తువులు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇదేకాకుండా ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని హ్యాష్ టాగ్లు ట్రెండ్ చేశారు. ఇక, కొంత మంది హిందూత్వ వాదులు ఈ సినిమాపై కేసులు కూడా పెట్టారు. దీంతో వెనక్కు తగ్గిన 'ఆదిపురుష్' టీమ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టి సినిమాను రీ షూట్ చేసింది. అయితే, ఇందులోనైనా రావణుడికి మరో కొత్త లుక్ ఇచ్చారో లేదో వేచి చూడాలి! కాగా, ఈ సినిమా 12 జూన్ 2023న విడుదల కానుంది.
'ఆదిపురుష్' చిత్రం విడుదల అయ్యేవరకు 'సలార్', 'ప్రాజెక్ట్ కే' చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు ఇవ్వకూడదని ప్రభాస్ ఆదేశించినట్లు నెట్టింట్లో చర్చ నడుస్తోంది. కాగా, రామాయణం ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. సన్నీసింగ్ లక్ష్మణుడు, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.