తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆమె వల్ల నేను చాలా బాధపడ్డా.. తను ఎందుకలా చేసిందో: అడివి శేష్​ - అడివి శేష్​ హిట్​ 2 ట్రైలర్​

'మేజర్‌'తో ఈ ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న హీరో అడివి శేష్‌.. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం 'హిట్‌-2' రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌పై ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.

Adavisesh about richa chaddha tweet
ఆమె వల్ల నేను చాలా బాధపడ్డా.. తను ఎందుకలా చేసిందో: అడివి శేష్​

By

Published : Nov 30, 2022, 5:31 PM IST

విభిన్న కథలతో ప్రేక్షకుల్లో ఫుల్​ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో అడివి శేష్​. ఇటీవలే మేజర్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకున్న ఆయన త్వరలోనే హిట్​ 2 అలరించనున్నారు. ఈ సందర్భంగా తాను పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగానే తాను ఆమె వల్ల చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

మూడు రోజులకే ప్యాకప్‌.. ''సొంతం' సినిమా విషయంలో నేను మోసపోయా. ఆ సినిమా అప్పుడు నా వయసు 15 ఏళ్లు. గడ్డం కూడా లేదు. అమ్మ వాడే కాటుకను గడ్డంలా పెట్టుకొని బిల్డప్‌ కొట్టేవాడిని. అలాంటి సమయంలో, ఆ సినిమా ఆఫర్‌ వచ్చింది. 'దిల్ చాహతా హై' ప్రీమేక్‌ చేస్తున్నాం. ఇందులో నలుగురు హీరోలు ఉంటారని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటకు ఓకే అన్నాను. తీరా చూస్తే మూడు రోజుల తర్వాత ప్యాకప్‌ చెప్పి.. వెళ్లిపొమ్మన్నారు. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు అది. ఆ తర్వాత పదేళ్ల పాటు అమెరికాలో చదువుకుని మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చా''

ఆమె ట్వీట్‌ వల్ల నేనెంతో బాధపడ్డా.. ''రిచా పెట్టిన ట్వీట్‌ వైరల్‌గా మారిన సమయంలో ఓ విలేకరి నాకు ఫోన్‌ చేశాడు. బాలీవుడ్‌ నటి పెట్టిన ట్వీట్‌పై మీ అభిప్రాయమేమిటి? అని అడిగాడు. వెంటనే ఆమె పెట్టిన ట్వీట్‌ చూశా. ఆమె ఉద్దేశం ఏమిటి అనేది తెలియదు కానీ, 'మేజర్‌' సినిమా వల్ల సైనికుల కష్టాలను దగ్గర నుంచి చూసిన వాడిగా ఆ ట్వీట్‌ నన్నెంతో బాధపెట్టింది''

నానిని అడిగితే.. నవ్వాడు.. ''ప్రస్తుతం నేను కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ అనే వ్యత్యాసం లేకుండా పనిచేస్తున్నా. ఆ బ్యాలెన్స్‌ తెలిసినప్పుడు పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నా ఫోకస్‌ అంతా సినిమాపైనే ఉంది. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారనే విషయంపై ఇటీవల నానిని అడగ్గా.. ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు'' అని శేష్ తెలిపారు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో 'అవతార్‌-2' ప్రదర్శన రద్దు..కారణం ఇదే..?

ABOUT THE AUTHOR

...view details