విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఇటీవలే మేజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే హిట్ 2 ది సెకండ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తోంది.
సస్పెన్స్ ప్లస్ రొమాన్స్.. ఆసక్తిగా అడివి శేష్ 'హిట్ 2' టీజర్ - ఆసక్తిగా అడివి శేష్ హిట్ 2 టీజర్
యంగ్ హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 సెకండ్ టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా మూవీటీమ్ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వైజాగ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా అడవి శేష్ టీజర్‌లో కనిపించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఓ యువతి మర్డర్ కేసుని సినిమాలో అడవి శేష్ ఛేదించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అత్యంత కిరాతకంగా యువతిని నరికి చంపినట్లు టీజర్‌లో చూపించారు. దాంతో సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో మూవీ ఉండబోతోందని అర్థమవుతోంది. తొలి భాగం తరహాలోనే హిట్ 2లో కూడా హీరో, హీరోయిన్స్ మధ్య కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 2న థియేటర్లలోకి రాబోతోంది.
ఇదీ చూడండి:ఈ శుక్రవారం థియేటర్లలో సందడంతా ఈ భామలదే