తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెండో పెళ్లిపై రేణు దేశాయ్​ పోస్ట్​.. తోడు కావాలంటూ.. - నటి రేణు దేశాయ్​ రెండో పెళ్లి

Renudesai second marriage తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌.. ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.

Renudesai Second marriage
రెండో పెళ్లిపై రేణు దేశాయ్​ పోస్ట్​.

By

Published : Sep 5, 2022, 1:17 PM IST

Renudesai second marriage నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌.. 'బద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు.. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటోంది. అయితే గతంలో రేణు దేశాయ్‌ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టాయి. జీవితంలో ఒక తోడు అవసరం అని ఆమె స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలోనూ పేర్కొంది.

ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కు 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు లేదు గానీ ఆమె మాత్రం వివాహం చేసుకోలేదు. అయితే తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది.

అనంతరం మరో పోస్ట్‌లో.. 'మీ సోల్‌మేట్‌ను వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'.. అంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి:'కేజీఎఫ్-2 సినిమా బాలీవుడ్​కు నచ్చలేదు.. నేనైతే నోరెళ్లబెట్టి చూశా'

ABOUT THE AUTHOR

...view details