'క్యారవాన్ మేకప్, కాస్టూమ్ మార్చుకోవడాని.. కాపురం చేయడానికి కాదు' అని ప్రముఖ నటి యమున ఓ సందర్బంలో చెప్పారట. ఆమె చెప్పిన ఆ మాటలను గుర్తు చేశారు ఆలీ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి యమున వచ్చిన సందర్భంగా అనేక విషయాలను యమున పంచుకున్నారు. ఇక తెలుగువారి అభిమాన ఛానల్ ఈటీవీలో ‘మౌన పోరాటం సినిమాకు సీక్వెల్గా రోబోతున్న సీరియల్ గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు.
'క్యారవాన్ కాపురం చేయడానికి కాదు.. మేకప్ కోసం' - mouna poratam serial
షూటింగ్ సమయంలో నటీనటులు క్యారవాన్ను ఉపయోగించే విషయంపై నటి యమున ఆసక్తికర కామెంట్స్ చేశారట. నటీనటులు క్యారవాన్కు పరిమితం కావడంపై అసహనం వ్యక్తం చేసి.. మేకప్ తర్వాత అందులో ఉండొద్దని చెప్పారట. ఈ విషయంపై ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె చెప్పిన మాటలను గుర్తు చేశారు ఆలీ.
యమున
'మౌనపోరాటం’ లేకపోతే తాను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని అన్నారు యమున. ఆ సినిమాకు ఎలా ఎంపికయ్యారో వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో అనాటి విశేషాలను వెల్లడించారు. దాసరి, మోహన్ గాంధీ దర్శకత్వంలో ఏం నేర్చుకున్నారో ఆమె ఈ సందర్భంగా వెల్లండిచారు. అలాగే నటించిన సినిమాలు, పని చేసిన భాషల గురించి మాట్లాడారు.
Last Updated : Apr 2, 2022, 10:44 PM IST