ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి అసలు పేరు రాజారాం నాయుడు. 1981 అక్టోబర్ 12న ముంబయిలో నివాసముంటున్న ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. 'ఇంగానే ఒరు నిలపక్షి' అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత తమిళంలో ఎన్నవలే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ నటించిన 'ప్రియమైన నీకు' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి హీరోయిన్గా ఎదిగారు. ఇంతకీ ఈమె మరోవరో కాదు సీనియర్ నటి స్నేహ.
ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన స్నేహ.. తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలివలపు సినిమాలో అమాయకమైన యువతిగా కనిపించిన ఆమె.. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. 2011లో వచ్చిన రాజన్న సినిమాలో నటించిన స్నేహ.. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. 2012లో చెన్నైలో ప్రసన్న వెంకటేశన్ అనే తమిళ హీరోను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.