శ్రుతి హాసన్.. తండ్రి ఓ సూపర్ స్టార్ అయినా అతడి నీడ పడకుండా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాలు నటించింది. తెలుగులో ఒకప్పుడు ఐరన్ లెగ్ అని అవమానాలు ఎదుర్కొన్న శ్రుతి.. ఇప్పుడు అగ్ర కథానాయకుల సరసన నటిస్తోంది. పవన్ కల్యాణ్‌తో నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాతో ఈ అమ్మడు సుడి తిరిగిపోయింది. నిజానికి పవన్, శ్రుతి ఇద్దరికీ ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ పిల్లి కళ్ల భామ. బాలకృష్ణ తర్వాతి సినిమా 'ఎన్బీకే 107', మెగాస్టార్ సినిమా 'మెగా 154' లో నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాతో కన్నడలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ అమ్మడు రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది. తాను ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. " నేను గ్రీస్‌లో ఎందుకు ఉన్నానో అనే విషయం మీతో పంచుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రత్యేక ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఎక్సైట్ అవుతున్నా" అని రాసుకొచ్చింది.