Sajid Khan Sherlin Chopra: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసే హిందీ 'బిగ్‌బాస్' ఇప్పటికి పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని, పదహారో సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ షో మీద మొదటి అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ షోపై 'మీ టూ' ఎఫెక్ట్ పడింది.
'బిగ్‌బాస్16'లో పార్టిసిపేట్ చేస్తున్న బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై ముంబయిలోని జుహూ పోలీస్ స్టేషన్‌లో నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేశారు. షో నుంచి సాజిద్ ఖాన్‌ను తప్పించాలని కోరారు.
పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కొద్ది రోజుల ముందు సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ విమర్శలు చేశారు. తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న తనకు 2005లో సాజిద్ నుంచి ఫోన్ వచ్చిందని, స్టోరీ చెబుతానని ఇంటికి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. అసలే దుఃఖంలో ఉన్న తనకు అప్పుడు ఆ ఘటనను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదన్నారు.