స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు సమంత కృతజ్ఞతలు తెలిపింది. యశోద సక్సెస్‌పై ఎమోషనల్ ట్వీట్ చేసింది.
ఆ విషయంలో ఫుల్ హ్యాపీగా సమంత.. కారణమిదే - సమంత ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ సమంత సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తానెంటో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని తెలిపింది.
"ప్రియమైన ప్రేక్షకులకు.. 'యశోద' మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మద్దతు నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబురాలు చూశా. సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్నా. దీని వెనుక మా చిత్ర బృందం నిర్విరామంగా పడిన కష్టం కనిపిస్తోంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. 'యశోద' ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన వాళ్లందరికీ థాంక్స్. నా పైన నమ్మకముంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్, దర్శకులు హరి, హరీష్, వరలక్ష్మీ శరత్ కుమార్,ఉన్ని ముకుందన్, చిత్రబృందానికి నా కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేసింది. కాగా, ఈ చిత్రంలో సామ్.. యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో అభిమానులను మెప్పించింది.
ఇదీ చూడండి:పవర్‌ఫుల్‌గా విశ్వక్ 'ధమ్కీ' ట్రైలర్.. బాలయ్య చేతుల మీదగా రిలీజ్