తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్​ చేసిన పనికి ఫిదా అయిన సమంత.. థ్యాంక్యూ మై లవ్​ అంటూ రిప్లై! - సమంత ఎమోషన్ల్​

స్టార్​ హీరోయిన్​ సమంత.. ఓ ఫ్యాన్ చేసిన పనికి ఫిదా అయింది. థ్యాంక్యూ మై లవ్​ అంటూ రిప్లై ఇచ్చింది. ఆ వివరాలు..

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 18, 2023, 10:43 AM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత వరుస సినిమాలో బిజీగా ఉంది. ఇటీవలే మయోసైటిస్​ వ్యాధి బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్​తో సోషల్​మీడియా ద్వారా ఎక్కువగా టచ్​లో ఉంటోంది. ఎప్పుటికప్పుడు హెల్త్​, సినిమా అప్డేట్లు ఇస్తుంది. ఇటీవలే యశోద సినిమాతో హిట్​ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే సామ్​.. ఓ షూటింగ్​లో గాయపడింది. ఆమె చేతికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్​మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అప్పుడు అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా సమంతకు ఆమె ఫ్యాన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. దెబ్బ తగిలిన సామ్ చేతులను అందంగా బొమ్మగా గీసింది. ఆ పెన్సిల్ ఆర్ట్​ను సోషల్​మీడియాలో షేర్ చేసింది.

సమంత ఫ్యాన్​

"నేను మీ సక్సెస్‌కు మాత్రమే ఫ్యాన్‌ని కాదు.. మీ హార్డ్ వర్క్, కమిట్‌మెంట్, కైండ్ నెస్‌కి పెద్ద అభిమానిని. ఈ గిఫ్ట్​ను 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు ఇస్తున్నా.. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా" అంటూ సామ్​ లేడీ ఫ్యాన్​ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్​కు సమంత రియాక్ట్ అవుతూ థ్యాంక్యూ మై లవ్ అని రిప్లై ఇచ్చింది.

మయోసైటిస్‌ వ్యాధి బారిన పడి, కోలుకుంటున్న సమంత కొన్నాళ్ల విరామం అనంతరం చిత్రీకరణలతో మళ్లీ బిజీ అయ్యారు. సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌ కోసం రంగంలోకి దిగారు. వెబ్​సిరీస్​లో ఆమె పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన శిక్షణ తీసుకుంటారు. సమంత ఇటీవల నటించిన యశోద చిత్రానికి యానిక్‌ పనిచేశారు. సిటాడెల్‌ కోసం ఇప్పుడు మరోసారి కలిశారు. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సిరీస్‌ ఇది. రాజ్‌- డీకే దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ఖుషి సినిమా చిత్రీకరణలో సమంత ఈ నెలలో పాల్గొంటారని సమాచారం. విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ రూపొందించిన శాకుంతలం చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. అందుకు మూవీ టీమ్​తో సమంత.. హైదరాబాద్​లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఇటీవలే సందర్శించింది. అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి.. సారె సమర్పించింది. ఆ సమయంలో సమంత చాలా క్యూట్​గా ఉందని ఫ్యాన్స్​ కామెంట్లు పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details