టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే యశోద సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. త్వరలోనే శాకుంతలం చిత్రంతో పలకరించనుంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్రయూనిట్.. ఓ షెడ్యూల్ ప్రకారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. సమంత ముంబయిలో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో.. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందులో శాకుంతలం చిత్రంలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది సామ్.
"శకుంతల. ఆమెకు చాలా నమ్మకాలు ఉన్నాయి.. తన ప్రేమలో.. తన భక్తిలో ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది. తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఆమె దయ.. గౌరవంతో భరించింది. తనను బాధించిన అనేక సంఘటనలను నమ్మకంతో ఎదుర్కొంది. ఆమె యువరాణి. అడవి.. జంతువుల పాత్రలు నాలోని చిన్నపిల్లను గుర్తుచేశాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శకుంతల పాత్ర పోషించినందుకు. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. శాకుంతలం సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.