తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నేచురల్​ బ్యూటీ? - sai pallavi movies

టాలీవుడ్​ నేచురల్​ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. భారీ విజయం సాధించిన 'శ్యామ్​ సింగరాయ్'​ మూవీ తర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోని ఈ భామ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.

సాయి పల్లవి
సాయి పల్లవి

By

Published : May 1, 2022, 7:08 PM IST

Sai Pallavi Marriage: 'ఫిదా' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. అందంతోనే కాకుండా అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసుకుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో తప్ప మిగతా సినిమాల్లో నటించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సైలెంట్​గా ఉంది. 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఈ సినిమా తరువాత ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. కనీసం ఎలాంటి వేడుకల్లో కూడా కనిపించట్లేదు. దీంతో ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సాయి పల్లవి

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో 'విరాటపర్వం' చిత్రం మాత్రమే ఉంది. రానా హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. విడుదల మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్​ తర్వాత సాయి పల్లవి పెళ్లి పీటలెక్కబోతుందట. అందుకే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త చిత్రాలను ప్రకటించలేదని టీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాయి పల్లవి సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. స్క్రిప్ట్ విషయంలో పల్లవి పక్కాగా ఉండాలి అనుకుంటోందట. అందుకే మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్‌ చేస్తోందని చెబుతున్నారు. మరి సాయిపల్లవి నిజంగానే మంచి పాత్ర కోసం వెయిట్‌ చేస్తుందో.. లేదా పెళ్లి కోసమే కొత్త ప్రాజెక్ట్స్‌ ఒప్పుకోవడం లేదో తెలియాలంటే.. ఆమె పెదవి విప్పే వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి:ప్యాలెస్ లాంటి ఇల్లు.. కళ్లు చెదిరే కార్లు.. ఫారిన్​ టూర్లు.. సమంత ఆస్తులు తెలిస్తే...

ABOUT THE AUTHOR

...view details