తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ

నటి రేణు దేశాయ్​ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ చెప్పారు. రవితేజ నటించబోయే ఓ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Actress Renudesai  Tiger nageswarao movie
రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ

By

Published : Sep 19, 2022, 4:13 PM IST

చాలా ఏళ్లుగా సినిమాలకు గ్యాప్​ ఇచ్చిన నటి రేణు దేశాయ్.. మళ్లీ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. తన సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తాను ఆద్య అనే వెబ్​సిరీస్​ చేస్తున్నట్లు ప్రకటించిన ఈమె.. తాజాగా మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. మాస్​ మాహారాజా రవితేజ చిత్రంతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. టైగర్​ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం అనే ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు చెప్పారు. రవితేజ్​కు అక్క పాత్ర అని సినీ వర్గాల టాక్​. కాగా, రేణు.. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్​ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు(అకీరా నందన్, ఆధ్యా). ఆ తర్వాత పవన్​తో విడిపోయారు.

ఇక టైగర్​ నాగేశ్వరరావు సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ పాన్​ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ రూపొందనుంది. 1970ల నేపథ్యంలో సాగే కథ ఇది. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ శక్తిమంతమైన పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకోనున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. మూడేళ్లుగా ప్రీపొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం సమకూర్చనున్నారు.

ఇదీ చూడండి: ఈ భామ రామానికే కాదు...అందరికీ నచ్చింది

ABOUT THE AUTHOR

...view details