సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లో అక్క, అమ్మ పాత్రల్లో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే కొద్ది కాలంగా సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనూ, జిమ్‌లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. ఫుడ్, బ్యూటీ, వర్కౌట్ వంటి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలతో నెటిజన్లను అలరిస్తున్నారు.
రెండో పెళ్లిపై నటి ప్రగతి కీలక కామెంట్స్.. ఏం చెప్పారంటే? - రెండో పెళ్లిపై నటి ప్రగతి కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ, వదిన పాత్రలు అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే పేర్లలో సీనియర్ నటి ప్రగతి తప్పకుండా ఉంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలో ఆమె తనదైన నటనతో మెప్పిస్తారు. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లిపై కీలక కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పారంటే..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రెండో పెళ్లి గురించి మాట్లాడారు. రెండో పెళ్లిపై ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా చేసుకోవాలని అనిపించిందా? అని యాంకర్ అడగగా ఇలా సమాధానమిచ్చారు. "పెళ్లి అనేది అవసరం. కానీ ఆ పదం కన్నా కంపానియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవెల్‌కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. అదీగాక సింగిల్ పర్సన్ దొరకడం కష్టం. కానీ.. రావాలని ఉంటే అది జరుగుతుంది. అయినా నాతో కొంచెం కష్టం. ఎందుకంటే.. కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్‌గా ఉంటాను. ఇలాగే కావాలి, అలాగే ఉండాలి అని అనుకుంటాను. ఇప్పుడు 20ల వయసు ఉంటే అడ్జెస్ట్ అయ్యేదాన్ని కావచ్చు. ఇప్పుడు కష్టం" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రగతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చూడండి:హోంబలే ఫిల్మ్స్ సెన్షేషనల్ అనౌన్స్మెంట్.. రూ.3 వేల కోట్ల బడ్జెట్‌తో