Actress Poorna marriage:నటి పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆమె ఈ రూమర్స్‌కు చెక్ పెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆమె కాబోయే భర్త్ షానిద్ని గట్టిగా కౌగిలించుకుని సిగ్గుపడుతున్నారు. "అతడెప్పటికీ నా వాడే" అంటూ లవ్ సింబల్స్‌ను జోడించారు. ఈ పోస్టుతో ఆమె వివాహం రద్దైనట్లు వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది.
అతడికి నటి పూర్ణ టైట్ హగ్.. 'ఎప్పటికీ నా వాడే' అంటూ.. - నటి పూర్ణ పెళ్లి క్యాన్సిల్
నటి పూర్ణ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే..
నటిగా తెలుగు వారికి చేరువైన పూర్ణ నిశ్చితార్థం యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీతో ఈ ఏడాది జూన్‌లో జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. నిశ్చితార్థమైన తర్వాత పూర్ణ, ఆమెకు కాబోయే భర్త షనీద్ మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో వీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా పూర్ణ షేర్ చేసిన ఫొటోతో ఆ వార్తలకు చెక్ పడింది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, ‘సీమ టపాకాయ్’ వంటి చిత్రాలతో ఈ మలయాళీ భామ తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
ఇదీ చూడండి: నితిన్ హీరోయిన్ కిరాక్ లుక్స్.. మళ్లీ చూడాలనిపించేంతగా..