Actress Poorna Engagement: 'శ్రీమహాలక్ష్మి', 'అవును', 'సీమ టపాకాయ్', 'అఖండ' వంటి చిత్రాలతో తెలుగువారిని అలరించిన మలయాళీ నటి పూర్ణ. న్యాయనిర్ణేతగానూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆమె తాజాగా తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తనకు నిశ్చితార్థమైందంటూ కాబోయే భర్తను పరిచయం చేశారు.
పెళ్లి పీటలెక్కనున్న మల్లు బ్యూటీ.. అతడితో ఎంగేజ్మెంట్
Actress Poorna Engagement: త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు నటి పూర్ణ. 'అవును', 'సీమ టపాకాయ్', 'అఖండ' వంటి చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న ఈ భామ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలిపారు. ఆమె చేసుకోబోయేది ఎవరినంటే?
actress poorna
యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని త్వరలో పెళ్లాడనున్నట్లు తెలిపారు పూర్ణ. "కుటుంబసభ్యుల ఆశీస్సులతో జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇక, ఇప్పుడు మా బంధం అధికారికం" అని పూర్ణ రాసుకొచ్చారు. పూర్ణ పెట్టిన పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.