టాలీవుడ్‌ను ఎప్పటికప్పుడు కొత్త అందాలు పలకరిస్తూనే ఉంటాయి. తెలుగు చిత్రసీమ ఎప్పుడూ కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటది. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అలా ఈ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా కొంతకాలం క్రితం టాలీవుడ్‌ను పలకరించిన హీరోయిన్. 2018లో ఫెమినా మిస్ ఇండియా విన్నర్‌గా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్‌గా నిలిచింది. అలా అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్గా చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడు అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇంతకీ ఈమె మెరెవరో కాదు మీనాక్షి చౌదరి.
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్.. గుర్తుపట్టగలరా? - నటి మీనాక్షి చౌదరి హాట్ ఫొటోషూట్
ఈ ఫొటోలు ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్. సుశాంత్, రవితేజ సినిమాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలోనే అడివిశేష్ సినిమాతో రానుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టగలరా?
సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన 'ఖిలాడీ'లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా చేసిన 'హిట్-2' విడుదల కావాల్సి ఉంది. అడివి శేష్ హీరోగా చేసిన ఈ థ్రిల్లర్ చిత్రం.. త్వరలోనే థియేటర్లలోకి రానుంది. తమిళంలోనూ 'కొలై' సినిమా చేసింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాలు చేసేందుకు రెడీ అవుతోంది.
ఇదీ చూడండి: ఎన్టీఆర్‌తో అదుర్స్ సీక్వెల్.. పూరితో అనుబంధం.. వి.వి.వినాయక్ ఏమన్నారంటే?