తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చాలా కాలం తర్వాత మీడియా ముందుకు లైలా.. ఇప్పుడెలా ఉందో చూశారా? - శివపుత్రుడు హీరోయిన్​ లైలా

నటి లైలా చాలా రోజుల తర్వాత మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు? ఇప్పుడెలా ఉన్నారో చూద్దాం..

Actress Laila about Karthi sardar movie
చాలా కాలం తర్వాత మీడియాకు ముందుకు లైలా

By

Published : Oct 19, 2022, 10:39 PM IST

Updated : Oct 20, 2022, 8:38 AM IST

లైలా.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. ఎన్నో హిట్​ చిత్రాల్లో నటించి.. తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 2004లో చివరిసారిగా మిస్టర్ అండ్ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి అనే సినిమాలో హీరోయిన్‌ నటించింది. 2006 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అయితే ఇప్పుడు లైలా తన కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. హీరో కార్తీ నటించిన సర్దార్‌ సినిమాలో నటించింది. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది.

"శివపుత్రుడు సినిమా 2003లో దీపావళి రోజు విడుదలైంది. అదే రోజు నా పుట్టినరోజు వచ్చింది. అలాగే ఇప్పుడు సర్దార్‌ సినిమా ఈ ఏడాడి దీపావళికి రాబోతోంది.. ఈ ఇయర్ కూడా నా పుట్టినరోజే దీపావళి రోజు వచ్చింది. చాలా ఎక్సైట్‌ గా ఉంది. అందరూ ఈ సినిమాని ఎంజాయ్‌ చేస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కార్తీ గారు ఈ సినిమాలో ఎంతో గొప్పగా చేశారు. అన్ని కోణాలతో ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఈ సినిమాని బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. నా తెలుగు కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు" అంటూ లైలా చెప్పుకొచ్చింది.

కాగా, నేడు(బుధవారం) సర్దార్‌ సినిమాకు సంబంధించి హైదరాబాద్​లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్‌ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లోనే లైలా కూడా పాల్గొని మాట్లాడింది.

ఇదీ చూడండి:పవన్​కల్యాణ్, కార్తిపై నాగార్జున కామెంట్స్​.. వారిద్దరూ అలాంటి వారంటూ..

Last Updated : Oct 20, 2022, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details