నటి కరాటే కళ్యాణిపై తెలుగు సినీ నటీనటుల సంఘం నిషేధం విధించింది. ఆమెను సస్పెండ్ చేసింది. తమ సంఘం నుంచి కళ్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ నోటీసులు పంపారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీనియర్ ఎన్టీఆర్(నందమూరి తారక రామారావు) విగ్రహ ఏర్పాటుపై రీసెంట్గా కరాటే కళ్యాణి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన 'మా'.. ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. దీంతో 'మా' నోటీసుపై స్పందించిన కరాటే కళ్యాణి.. ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయితే కళ్యాణి వివరణపై 'మా' కార్యవర్గం సంతృప్తి చెందలేదు. దీంతో 'మా' నిబంధనల ప్రకారం కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు తెలిపారు. మరి తనను సస్పెండ్ చేయడంపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో, ఏం మాట్లాడుతుందో చూడాలి.
నటి కరాటే కళ్యాణికి 'మా' ఝలక్.. సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం..
నటి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది.
అసలేం జరిగిందంటే.. నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది కృష్ణుడు రూపంలో ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నానయి. మే 28న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దీనిపై కరాటే కళ్యాణి స్పందించింది. కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ వీల్లేదంటూ ఆమె వ్యతిరేకించింది. "దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరిస్తున్నారు? ఎవరిని మెప్పించడానికి ఇలా చేస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించింది. నిరాహార దీక్ష కూడా చేసింది. మొత్తంగా దీనిపై పెద్ద చర్చే సాగింది. కొందరు కరాటే కళ్యాణిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శించారు. నెగటివ్ కామెంట్లు కూడా పెట్టారు. అదే సమయంలో తెలుగు సినిమాకు గర్వకారణమైన ఎన్టీఆర్‌పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ కూడా అయ్యారు. అసోసియేషన్ తరఫున ఆమెపై చర్యలు తీసుకున్నారు. షో కాస్ నోటీసులు పంపారు. ఇంకోవైపు కొన్ని హిందూ సంఘాలు హైకోర్టుకు కూడా వెళ్లాయి. వారికి అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలను కూడా జారీ చేసింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని స్టే విధించింది. మరి ఈ పరిణామాలన్ని ఎక్కడికి దాకా వెళ్తాయో తెలియదు.
ఇదీ చూడండి:60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్