తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్​ హీరోయిన్​ కాజల్​! - kajal agarwal baby

Kajal Agarwal Baby Boy: స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్-గౌతమ్ దంపతులకు మగబిడ్డ పుట్టాడని మంగళవారం పలు నేషనల్‌ వెబ్‌సైట్స్‌ తమ కథనాల్లో పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కాజల్‌ కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

KAJAL BABY BOY
KAJAL BABY BOY

By

Published : Apr 19, 2022, 7:12 PM IST

Kajal Agarwal Baby Boy: అందాల నటి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ కుటుంబం ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ మీడియా వర్గాలు మాత్రం ఈ వార్తను ధృవీకరించాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని తమ కథనాల్లో స్పష్టం చేశాయి.

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య సినిమా షూటింగ్​లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల కాజల్ బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ABOUT THE AUTHOR

...view details