ఒకప్పుడు టాలీవుడ్లో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో జ్యోతిక ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. చిరంజీవితో 'ఠాగూర్', నాగార్జునతో 'మాస్', రజనీకాంత్‌తో 'చంద్రముఖి', కమల్‌హాసన్‌తో 'రాఘవన్'... ఇలా ఎందరో టాప్ స్టార్స్‌తో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2006లో తమిళ హీరో సూర్యను వివాహం చేసి కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. పర్సనల్లైఫ్లో ఫుల్ బిజీ అయిపోయారు.
మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మరోసారి తెరపై సందడి చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. ఓ వైపు నటిగా మరోవైపు నిర్మాతగా.. ఇక పర్సనల్ లైఫ్‌లో తల్లిగా, భార్యగా ఎన్నో బాధ్యతలతో కెరీర్లో ముందుకెళ్తున్నారు. అయితే ఈమెలో ఇప్పటివరకు కనిపించని మరో టాలెంట్ కూడా ఉందని మీకు తెలుసా? తాజాగా ఆమె ప్రతిభకు సంబంధించి ఓ సూపర్ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటంటే..