తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తీన్మార్ డ్యాన్స్‌తో ఇరగదీసిన ఇంద్రజ.. 'మేడమ్ సార్ మేడమ్ అంతే!' - ఇంద్రజ లేటెస్ట్​ డ్యాన్స్​

ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్​టైన్​మెంట్​ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ తన డ్యాన్స్‌తో ఇరగదీశారు. దసరా చిత్రంలోని కీర్తి సురేశ్ తీన్మార్ డ్యాన్స్‌ను ఈ షోలో చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఇంద్రజ డ్యాన్స్​ను చూసేయండి.

actress indraja mass dance like dasara keerthy suresh in etv sridevi drama company show
actress indraja mass dance like dasara keerthy suresh in etv sridevi drama company show

By

Published : Apr 21, 2023, 5:05 PM IST

Updated : Apr 21, 2023, 5:19 PM IST

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా.. బాక్సాఫీస్​ వద్ద సూపర్​ హిట్​ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ అంతా ఒక ఎత్తైతే.. ఇందులో వెన్నెల రోల్‌లో కీర్తి సురేశ్​ పెర్ఫార్మెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా పెళ్లి కూతురు గెటప్‌లో ఆమె చేసిన తీన్మార్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే రీతిలో పక్కా తెలంగాణ స్టైల్ తీన్మార్ డ్యాన్స్‌తో కీర్తి అదరగొట్టింది. ఇప్పటికీ ఆమె డ్యాన్స్ వీడియోకు స్పూఫ్‌లు, రీల్స్ విపరీతంగా వచ్చాయి. ఆడియెన్సే కాకుండా సెలబ్రెటీలు కూడా కీర్తి తీన్మార్‌ను అనుకరించడం ప్రారంభించారు.

తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్​టైన్​మెంట్​ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. దసరా చిత్రంలో కీర్తి సురేశ్​ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. అచ్చం కీర్తి మాదిరిగానే తన హావాభావాలతో దుమ్ముదులిపారు. తన మాస్ స్టెప్పులకు అక్కడున్న వారే కాకుండా.. ఈ వీడియోను చూసిన వారు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వయసులోనూ ఆమె ఎనర్జీకి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

"ఇంద్రజ గారి మాటల్లో ఎంత డెప్త్ ఉందో.. డ్యాన్స్‌లోనూ అంతే డెప్త్ ఉంది" అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టారు. "మళ్లీ 90ల్లో డ్యాన్స్‌లోకి ఇంద్రజ గారు తీసుకెళ్లారు" అని మరొకరు స్పందించారు. "మేడమ్ ఇప్పటిదాకా చేసిన డ్యాన్స్ ఒక ఎత్తు ఈ డ్యాన్స్ మరో లెవల్.. మేడమ్ సార్ మేడమ్ అంతే" అంటూ ఇంకొక నెటిజన్​ కామెంట్​ పెట్టారు.

బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీలు చిక్కినప్పుడల్లా తనలో మల్టీ టాలెంట్‌ను అప్పుడప్పుడు బయటపెడుతుంటారు ఇంద్రజ. ఆటలు, పాటలతోనే తనదైన మార్కు చూపిస్తుంటారు. తాజాగా కీర్తి సురేశ్​ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టడంతో సర్వత్రా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే ఈ షో వందో ఎపిసోడ్​లో ఇంద్రజ తన తియ్యటి గాత్రంతో అభిమానులను అలరించారు. అద్భుతంగా పాడి ఆశ్చర్యపరిచారు. "ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ" పాటను పాడుతుంటే అక్కడున్న ప్రతీ ఒక్కరు మైమరచిపోయారు. అంతలా తన గొంతుతో మెస్మరైజ్ చేశారు. 'ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ' అనే మరోపాట కూడా పాడారు. ఇది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Last Updated : Apr 21, 2023, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details