Ileana Dating katrina Brother : 'దేవదాస్', 'పోకిరి', 'కిక్', 'మున్నా', 'రాఖీ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను చేరువైన హీరోయిన్ ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ అవకాశాలు రావడం వల్ల అక్కడే స్థిరపడిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మకు గత కొంతకాలంగా అవకాశాలు లేక అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తోంది. కానీ లైఫ్‌ను మాత్రం ఫుల్‌గా ఆస్వాదిస్తోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. బీచ్‌లో దిగిన బికినీ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. తాజాగా ఈ భామ మరోసారి ప్రేమలో పడిందని టాక్. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో సహజీవనం చేస్తోందని వదంతులు వస్తున్నాయి.
తాజాగా 'కాఫీ విత్ కరణ్ షో'కు హాజరైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను.. కరణ్ జోహార్ ఈ విషయంపై ప్రశ్నించారు. 'మీ సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా రిలేషన్ షిప్లో ఉన్నారంటగా' అంటూ కరణ్ అడిగారు. అయితే ఈ ప్రశ్నను కత్రిన ఖండించలేదు. అలా అని స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో గోవా ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడిందని బీ టౌన్ మొత్తం కోడై కూస్తోంది.