తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇలియానాకు ఆ సమస్య క్లియర్​ అయినట్టేనా? - Ileana telugu films ban

ఇలియానాపై బ్యాన్​ విధించారని, అందుకే ఇక్కడ నటించట్లేదని గతంలో ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ వివరాలు..

Ileana D Cruz
ఇలియానాకు ఆ సమస్య క్లియర్​ అయినట్టేనా

By

Published : Feb 2, 2023, 4:26 PM IST

దేవదాసు చిత్రంతో చిత్రపరిశ్రమకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. అతి తక్కువ కాలంలోనే స్టార్​ డమ్​ను సంపాదించుకుంది. అగ్రహీరోలతో కలిసి నటించింది. అయితే ఇప్పుడామె టాలీవుడ్‌కు కాస్త దూరమైంది. ఆ మధ్యలో ఆరేళ్ల తర్వాత 2018లో అమర్‌ అక్బర్‌ ఆంటోనీతో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసినా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇలియానా మళ్లీ హిందీలో బిజీ అయిపోయింది. అయితే అప్పటి నుంచి ఆమె తెలుగులోనే నటించకపోవడానికి కారణం ఆమెపై బ్యాన్​ విధించారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి.

ఇలియానా.. తమిళ చిత్రసీమలో ఒక అగ్ర నిర్మాత దగ్గర.. ఓ సినిమాకు కమిటై అడ్వాన్స్​ తీసుకుని హ్యాండ్​ ఇచ్చిందని అపట్లో అన్నారు. చిత్రీకరణ సమయానికి ఆమె రాకపోవడంతో మరో భామతో ఆ సినిమా చేశారట. తమ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమెను కోరారట. కానీ ఆమె చివరికి ఇవ్వలేదంటూ ప్రచారం సాగింది.

దీంతో సదరు నిర్మాత కోలీవుడ్ ఫిలింఛాంబర్​తో టాలీవుడ్ నిర్మాతల మండలిని ఫిలిం ఛాంబర్​కు ఫిర్యాదు చేశారట. అయితే ఆ సమస్య క్లియర్​ అయ్యేంత వరకు ఆమెను సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నారంటూ అపట్లో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడా ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇకపోతే ఇలియానాకు ఆ సమస్య క్లియర్​ అయిపోయిందని అంటున్నారు. త్వరలోనే ఇక్కడ నటించే అవకాశం కూడా ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇకపోతే ఇలియానా ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. అయితే తాను బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆణె చివరిసారిగా ది బిగ్‌ బుల్‌ అనే హిందీ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఇక ఈమె బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:సుక్కు శిష్యుల క్రేజ్​​.. రిలీజ్​ కాకముందే ఆఫర్లే ఆఫర్లు!

ABOUT THE AUTHOR

...view details