Actress Ileana D Cruz Baby : గోవా బ్యూటీ ఇలియానాపండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆగస్టు 1న చిన్నారి జన్మిస్తే.. ఈ విషయాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సాధారణంగా చాలామంది సెలెబ్రిటీలు కొన్ని నెలలు గడిచే దాకా.. చిన్నారుల ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపడానికి ఇష్టపడరు. కానీ ఇలియానా రీసెంట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే.. ఆమె ఇందుకు భిన్నం అని అర్థం అవుతోంది. చిన్నారి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అబ్బాయి ' కోవా ఫీనిక్స్ డోలన్' పేరును ప్రకటించారు.
"మా ప్రియమైన అబ్బాయికి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకడానికి ఎంత ఆనందంగా ఉన్నామో మాటల్లో చెప్పలేము" అని ఇలియానా ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. 'దేవదాస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలియానా. తర్వాత 'పోకిరి' సినిమాతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టారు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఈ గోవా బ్యూటీ.. మెల్లిగా బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అక్కడ కూడా అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇలియానా.