ప్రముఖహాస్యనటి గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి.. ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. 'దయచేసి కార్‌లో అయినా బైక్‌లో అయినా జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు.. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓం శాంతి' అని కరాటే కళ్యాణి తన పోస్టులో తెలిపారు.
కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి! - గీతాసింగ్ సినిమాలు
హాస్యనటి గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె కుమారుడు.. రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే గీతాసింగ్‌కు ఇంకా పెళ్లి కాలేదు.
అయితే నిజానికి గీతాసింగ్‌కు పెళ్లికాలేదు. తన అన్నయ్య అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఆయన ఇద్దరు పిల్లలను గీతాసింగ్ పెంచుకుంటున్నారు. అన్నయ్య కుమారుల భారాన్ని గీతాసింగ్ తనపై వేసుకున్నారు. అప్పటి నుంచీ ఆ ఇద్దరు పిల్లలతో పాటు తన కజిన్ కుమార్తెను కూడా సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. అయితే శుక్రవారం గీతాసింగ్ పెద్ద కుమారుడు నలుగురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గీతాసింగ్ కుమారుడు కన్నుమూశాడు.
గీతాసింగ్ కెరీర్ విషయానికొస్తే.. కితకితలు సినిమాతో వచ్చిన పాపులారిటీతో ఆ తరవాత వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 50కు పైగా సినిమాల్లో గీత నటించారు. అలీ, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్స్‌తో కలిసి గీతాసింగ్ నటించారు. గత కొంతకాలంగా గీతాసింగ్‌కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలోనూ నటించడం లేదు.