సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్ స్టాటస్‌ను అందుకుని ఆ తర్వాత కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకటి. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ బ్యూటీ.. తక్కువ వయసులోనే తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్‌గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కూడా నటించింది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే ఛార్మి.
ఛార్మీ చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా 'ముజ్ సే దోస్తీ కరోగి' చిత్రంలో నటించింది. పదిహేనవ ఏటా తమిళంలో 'కాదల్ అలివదిల్లయ్', మలయళంలో ఆమె చేసిన ' కట్టుచెంబాకమ్' రెండు వరుస ఫ్లాపులు అందుకున్నాయి. ఆ తర్వాత తెలుగు లో 'నీతోడు కావాలి' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ చిత్రం కూడా పెద్దగా హిట్ కాలేదు.