తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాటు నాటు'కు ఆలియా ఇరగదీసిందిగా.. వీడియో చూశారా? - ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్​ ఆస్కార్​

'నాటు నాటు'.. ఇది పాట కాదు ఒక సంచలనం! 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని ఈ పాట ఎన్నో అవార్డులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఈ పాటకు స్టెప్పులేయగా.. తాజాగా ఆ చిత్రంలో నటించిన ఆలియా భట్​ ఇరగదీసింది. ప్రస్తుతం ఆలియా డ్యాన్స్​ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ సారి ఆ వీడియోను చూసేయండి.

actress alia bhatt dance for RRR natu natu song video viral in social media
actress alia bhatt dance for RRR natu natu song video viral in social media

By

Published : Feb 27, 2023, 5:18 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం 'ఆర్​ఆర్​ఆర్'. ఈ​ సినిమాలోని 'నాటు నాటు' పాట.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది. అనేక మంది సామాన్యులు, సెలబ్రెటీలు, నెటిజన్లు ఈ పాటకు డ్యాన్స్​ చేశారు. అయితే ఆర్ఆర్​ఆర్​ చిత్రంలో నటించిన ఆలియా భట్​ మాత్రం ఎక్కడా ఆ పాటకు స్టెప్పులు వేయలేదు. తాజాగా ఆలియా కూడా ఆ పాటకే స్టెప్పులేసేసింది. చాలా రోజుల తర్వాత స్టేజ్​పై కనిపించిన ఆలియా.. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. అది కూడా తల్లయినా కొన్ని రోజులకే ఆ పాటకు స్టెప్పులేయడం చాలా గ్రేట్​!

ప్రస్తుతం సోషల్​మీడియాలో ఆలియా డ్యాన్స్​ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ముంబయిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలియా.. తెల్ల చీరలో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె ఎనర్జటిక్ డ్యాన్స్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆలియా అమ్మగా మారి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. అప్పుడే ఆమె ఇలా స్టేజ్ పైకి తిరిగి రావడమే కాదు.. నాటు నాటు లాంటి పాటకు స్టెప్పులేయడం ఫ్యాన్స్​ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆలియాకు అసలు ఎవరూ పోటీ లేరని, ఆమె గ్రేటెస్ట్ అంటూ ఈ డ్యాన్స్ చూసిన తర్వాత పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

అయితే ఆర్​ఆర్​ఆర్​ చిత్రం.. సూపర్​ డూపర్​ హిట్​గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు సాధించిన ఈ సినిమా.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సినిమాలో నాటు నాటు పాట అయితే ఏకంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్​ నామినేషన్​ కూడా దక్కించుకుంది. తాజాగా ఈ పాటకు హాలీవుడ్​ క్రిటిక్స్​ అసోసియేషన్​ అవార్డ్​ కూడా వరించింది.

ఇటీవలే నాటు నాటు పాటకు సౌత్​ కొరియాలో ఇండియా​ ఎంబసీ ఉద్యోగులు​ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు. కొరియన్​ వనితలు పాటకు తగ్గట్టుగా డ్యాన్స్​ చేయగా.. పురుషులు కూడా ఎన్టీఆర్​, చరణ్​లా డ్రెస్​ వేసుకుని నాటు నాటు స్టెప్పులేశారు. ఈ వీడియోను కొరియాలోని ఇండియా ఎంబసీ తన ట్విట్టర్​ అకౌంట్​లో షేర్​ చేసింది. అయితే ఈ ట్వీట్​ను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో మురిసిపోయారు. వీడియో ఎంతో బాగుందని.. టీమ్​ చేసిన కృషి ఇంకా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details