Actor Yash Dance : రాకీ భాయ్ యశ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి చాలా కాలం అయిపోయింది. కేజీయఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన కొత్త సినిమా అప్డేట్ కోసం యావత్ భారత దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఏదీ ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా యశ్ ఓ వేడుకలో డ్యాన్స్‌లు వేస్తూ సరదాగా కనిపించారు. తన తోటి హీరో దర్శన్‌తో కలిసి చిందులేశారు. అది చూసిన నెటిజన్లు, అభిమానులు ఎంతో సంతోషపడిపోతున్నారు. తెగ మురిసిపోతున్నారు. ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
ఆ పార్టీలో..
Sumalatha son wedding : సీనియర్ నటి, ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం రీసెంట్గా గ్రాండ్‌గా జరిగింది. బెంగుళూర్‌లోని ఓ ప్యాలెస్‌లో.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో సుమలత.. తాజాగా ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి నటీ నటులంతా హాజరై సందడి చేశారు.
అందులోనే స్టార్ హీరోలు యశ్-దర్శన్‌లు.. సుమలత, కొత్త జంటతో కలిసి స్టేజ్‌పై చిందులేశారు. ఒకరి చేయి ఇంకొకరు పట్టుకుని స్టెప్పులేశారు. వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపారు. వీరంతా కలిసి విజయ్‌ప్రకాశ్ హిట్ సాంగ్ 'జలీల' సాంగ్‌కు.. స్టెప్స్‌లు వేశారు. ముఖ్యంగా యశ్ మరింత ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు తెగ లైక్స్ కామెంట్లు పెడుతున్నారు.