'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తన నటనతో యవతను ఆకట్టుకున్నారు. ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. తాజాగా ఈ స్టార్ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆయన తన స్టైల్లో సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ''మర్చిపోలేని ఒక్క హిట్ ఇవ్వన్నా'' అని ఓ ఫ్యాన్ అడిగగా.. దానికి విజయ్ స్పందిస్తూ.. ''హిట్ ఒక్కటే పెండింగ్ రా.. త్వరలో కొట్టేద్దాం'' అని అన్నారు. ఇక ఈ వీడియోను విజయ్ అభిమానులు షేర్ చేస్తూ 'ఖుషి' సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ వస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
'హిట్ ఒక్కటే పెండింగ్ తమ్ముడూ!.. త్వరలో కొట్టేద్దాం' - విజయ్ దేవరకొండ ఆస్క్ ట్విట్టర్
తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్.. అప్పుడప్పుడు అభిమానులతో మాట్లాడతారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు విజయ్. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఓ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఆ ఆన్సర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన సినిమా 'లైగర్'. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. దీంతో ప్రస్తుతం విజయ్ తన ఆశలన్నీ 'ఖుషి' సినిమాపైనే పెట్టుకున్నారు. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తైంది. మిగిలిన భాగం షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతో పాటు పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి కథను కూడా విజయ్ ఓకే చేశారు. వీటితో పాటు నానితో కలిసి ఓ మల్టీస్టారర్‌లో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది.