Actor vijay buys a new house: బీస్ట్ సినిమా హీరో, తమిళ నటుడు దళపతి విజయ్‌కు టాలీవుడ్ కోలివుడ్‌లోనే కాదు ఓవర్సీస్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పటి డ్రీమ్బాయ్స్ లిస్ట్‌లో ఉన్న విజయ్ ఐదు పదుల వయసులోనూ అమ్మయిల మనసులు దోచుకుంటున్నారు. సినిమా ఏదైనా క్యారెక్టర్ ఎటువంటిదైనా అవలీలగా చేయగలరు. తాజాగా ఓ కొత్త ఇల్లు కొని వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఇంటి గురించి తెలుసుకుందాం.
విజయ్ చెన్నైలోని ఓ ఏరియాలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ నుంచి మారబోతున్నారట. ఈరోడ్‌లో ట్రాఫిక్ బాగా పెరిగిపోవడం వల్ల అక్కడ నుంచి షిఫ్ట్ కావాలనుకున్నారట. అందులో భాగంగా చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 35కోట్లు అని సమాచారం.
అంతకుముందున్న అడయార్‌లోని తన ఇంటిని ఆఫీస్‌గా మార్చుకున్నారు విజయ్. అయితే ఇప్పుడు కొన్న కొత్త బిల్డింగ్‌లోనే ఆఫీస్‌ను కూడా పెట్టుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే అడయార్ ఇంటి నుంచి విజయ్ తన 'విజయ్ మక్కల్ ఇయ్యకం' పార్టీ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని వినికిడి. ప్రస్తుతం విజయ్ కొన్న అపార్ట్మెంట్లో మరో కోలీవుడ్ హీరో కూడా ఉంటున్నారని సమాచారం.
ఇక ప్రస్తుతం విజయ్ తెలుగులోకి ఎంట్రీకి సిద్ధమయ్యారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న'వారసుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో 'వారిసు'గా రూపొందనుంది. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు.